వరుస సినిమాలతో అక్కినేని అభిమానులకు ఇక పండగే
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఆటాడుకుందాం...రా చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ప్రేమమ్. ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంచలన చిత్రాన్ని సెప్టెంబర్ 16న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక సుమంత్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్ చిత్రానికి రీమేక్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సుమంత్ తెలియచేసారు. ఈవిధంగా ఈ నెల నుంచి సుశాంత్, చైతన్య, సుమంత్....ఇలా వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తుంటే అక్కినేని అభిమానులకు పండగే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com