చైతూకి రౌడీ బేబి బర్త్ డే విషెస్.. అక్కినేని ఫ్యాన్స్ ఫిదా
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ 19 వ సినిమా తెరకెక్కుతుండగా.. సాయిపల్లవి చైతో జతకట్టింది. ఈ సినిమాకు సంబంధించిన చైతు లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. కాగా చై బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ అయింది. ఈ వీడియోనే షేర్ చేస్తూ... చైతూకి విషెస్ తెలిపింది సాయిపల్లవి. వార్మెస్ట్ స్మైల్ అండ్ కైండెస్ట్ హార్ట్ ఉన్న చై గారికి బర్త్ డే అంటూ పోస్ట్ పెట్టింది.
దీంతో అక్కినేని అభిమానులు సాయిపల్లవి విషెస్ కి ఫిదా అయిపోయారు. థాంక్యూ రౌడీ బేబీ అంటూ కామెంట్లు పెడ్తున్నారు. కాగా ఫిదా సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ప్రేమకథ చిత్రం కావడంతో ... భారీగా అంచనాలు పెరిగిపోయాయ్. కాగా.. ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్ పి పతాకాలు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయ్.
Happy Birthday to the man with the warmest smile and kindest heart, Chay Garu ! @chay_akkineni https://t.co/JleJErbpiW
— Sai Pallavi (@Sai_Pallavi92) November 23, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com