సమంత పై అక్కినేని అభిమానుల ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని కుటుంబంలోకి సమంత త్వరలోనే అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. చైతు, సమంత మధ్య ప్రేమ వ్యవహారానికి గ్రీన్ సిగ్నల్ పడటం, అక్టోబర్6న ఇద్దరికీ పెళ్ళి కూడా కానుంది. ఈ సమయంలో సమంత చర్యలు కొన్ని అక్కినేని అభిమానులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. రీసెంట్‌గా చేనేత వస్త్రాల కోసం సమంత హాట్ పోజులు విషయంలో అక్కినేని అభిమానులు కాస్తా గుర్రుగానే ఉన్నారు.
అభిమానుల కోపం చల్లారక ముందే సమంత బికినే డ్రస్ ఫోటోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. గ్లామర్ ఫీల్డ్ నుండి బయటకు వచ్చి అక్కినేని వారింటి కోడలుగా సమంత మెప్పిస్తుందనుకుంటున్న తరుణంలో సమంత ఇలా ఫోటోలతో హాల్ చల్ చేయడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. దాంతో వారు అక్కినేని వారింటి కోడలు అవుతున్న సమయంలో ఇలాంటి వేషాలేంటని సమంతని తిట్టిపోశారు. అయితే సమంత కూడా తానేం తక్కువ తినలేదన్నట్లు గట్టి రిప్లైనే ఇచ్చింది. డ్రెస్‌కోడ్‌ను బట్టి ఓ వ్యక్తి క్యారెక్టర్‌ను డిసైడ్ చేసే మీలాంటి వాళ్ళను చూస్తుంటే సిగ్గుగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఏదేమైనా సమంత చేష్టలు మాత్రం అక్కినేని అభిమానులకు రుచించడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com