సందడంతా అక్కినేని ఫ్యామిలీదే..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ తరువాత ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీగా అక్కినేని ఫ్యామిలీని చెప్పుకోవచ్చు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్.. ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఈ కుటుంబానికి చెందిన కథానాయకులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ద్వితీయార్థంలో వీరి సినిమాల హవా ఎక్కువగా కనిపించనుంది. ముఖ్యంగా జూలై నుంచి అక్టోబర్ వరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి కనీసం ఓ సినిమా రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. జూలై 27న నాగచైతన్య కథానాయకుడిగా నటించిన సవ్యసాచి రిలీజ్ కానుండగా.. ఆగస్టు చివరి వారంలో శైలజా రెడ్డి అల్లుడు విడుదలయ్యే అవకాశముంది.
ఇక సెప్టెంబర్లో కింగ్ నాగార్జున మల్టీస్టారర్ మూవీ సందడి చేయనుంది. అలాగే అక్టోబర్ నెలలో అఖిల్ హీరోగా నటిస్తున్న మూడో చిత్రం రాబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే.. నాలుగు నెలల పాటు అక్కినేని వారి సినిమాల సందడి తెలుగు తెరపై కొనసాగనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com