హరిత హారం లో.. అక్కినేని ఫ్యామిలీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని ఫ్యామిలీ హరితహారం కార్యక్రమంలో కూడా ముందుండి ఎంతో మందికి స్పూర్తి నిచ్చారు. రెండు రోజుల క్రితం అక్కినేని అఖిల్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
అనంతరం అఖిల్ మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి జంతువులు, పర్యావరణం కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎక్కువ. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటితే మనతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో మంచిది అంటూ స్పందించారు. ఈరోజు అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ స్టాఫ్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీసులతో కలిసి కూడా నాగార్జున మొక్కలను నాటి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు. నాగార్జున ఇచ్చిన పిలుపుతో అభిమానులు హరితహారం కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లిలో మొక్కలు నాటారు. కూకట్ పల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో అమల అక్కినేని పాల్గొని మొక్కలు నాటారు. ఇలా...అక్కినేని కుటుంబం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటి అందరిలో స్పూర్తి నింపడం అభినందనీయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments