అక్కినేని ఫ్యామిలీ మరో ప్రొడక్షన్ హౌస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖమైన నిర్మాణ సంస్థలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. అక్కినేని ఫ్యామిలీ ఈ స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షించుకుంటారు. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తాడు. ఇది కాకుండా, నాగార్జున అతని కొడుకులు కలిసి మనం ఎంటర్టైన్మెంట్స్ను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ ఫ్యామిలీ నుండి మరో నిర్మాణ సంస్థ కూడా రానుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నాగచైతన్య, సమంత కలిసి ఓ బ్యానర్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో ఈ బ్యానర్లో ప్రధానంగా సినిమాలు చేస్తారు. కుదిరితే నాగచైతన్య, సమంత కూడా నటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మరి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com