వీకెండ్ పార్టీలో అక్కినేని బ్రదర్స్..!
- IndiaGlitz, [Sunday,November 06 2016]
నాగచైతన్య, సమంత ప్రేమలో పడడం, అఖిల్, శ్రేయా భూపాల్ ప్రేమలో పడడం తెలిసిందే. అఖిల్, శ్రేయా భూపాల్ డిసెంబర్ 9న ఎంగేజ్ మెంట్ చేసుకుని వచ్చే సంవత్సరంలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే..చైతు, సమంత మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇదిలా ఉంటే... చైతన్య,సమంత జంట, అఖిల్, శ్రేయా భూపాల్ జంట వీకెండ్ పార్టీ చేసుకున్నారు.
ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...ఫ్యామిలీతో పార్టీ అంటూ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో చైతు, సమంత జంట, అఖిల్, శ్రేయా భూపాల్ జంట చూడముచ్చటగా ఉంది. అన్నయ్య కంటే ముందుగా తమ్ముడు అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి...అన్నయ్య చైతు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో..? ఏది ఏమైనా...హాలో బ్రదర్...ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా...అనేలా ఉన్న స్టిల్ అదిరింది..!