వైజాగ్ లో సంద‌డి చేస్తున్న అక్కినేని బ్ర‌ద‌ర్స్..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

అక్కినేని బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య‌, అఖిల్ వైజాగ్ లో సంద‌డి చేస్తున్నారు. ఇంత‌కీ చైతు, అఖిల్ వైజాగ్ లో ఏం చేస్తున్నారు అంటే...నాగ చైత‌న్య హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఈ షూటింగ్ నిమిత్తం వైజాగ్ వ‌చ్చిన చైత‌న్య‌ను ఫ్యాన్స్ క‌లిసి ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించినందుకు అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇక అఖిల్ వైజాగ్ రావడానికి కార‌ణం ఏమిటంటే...సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు అఖిల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో హైద‌రాబాద్ కొత్త‌పేట‌లో షాపింగ్ మాల్ ప్రారంభించారు. ప‌దో షాపింగ్ మాల్ ను వైజాగ్ లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వం కోసం అఖిల్ వైజాగ్ వ‌చ్చారు. ఈ విధంగా ఒకేరోజు అక్కినేని బ్ర‌ద‌ర్స్ చైత‌న్య‌, అఖిల్ వైజాగ్ లో సంద‌డి చేయ‌డం విశేషం..!

More News

ఎన్టీఆర్ మూవీ గురించి న్యూ న్యూస్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి...ఇలా  చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఎవ‌రికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

జయమ్ము నిశ్చయమ్మురా - కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ తదితర ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది.

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఖైదీ నెం 150 విడుదల

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచే 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ భారీ యాక్షన్ డ్రామాను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

జర్నీని మించిన విజయాన్ని మెట్రో సాధిస్తుంది -నందు

వరల్డ్ సినిమాని, మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు.

గుమ్మడికాయ కొట్టేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన హిస్టారికల్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ , భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు.