అక్కినేని అమ‌ల రీ ఎంట్రీ..!

  • IndiaGlitz, [Thursday,November 10 2016]

అక్కినేని అమ‌ల శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు క‌దా..! మ‌ళ్లీ రీ ఎంట్రీ ఏమిటి అనుకుంటున్నారా..? విష‌యం ఏమిటంటే...తెలుగులో అమ‌ల‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆత‌ర్వాత గ‌త సంవ‌త్స‌రం హ‌మారీ అధూరి క‌హానీ చిత్రంతో హిందీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం.

25 సంవ‌త్స‌రాల క్రితం మోహ‌న్ లాల్ న‌టించిన ఉల్లాడ‌క్కం సినిమాలో అమ‌ల న‌టించారు. ఆంటోని సోని డైరెక్ష‌న్ లో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ కేరాఫ్ సైరాభాను సినిమాలో న‌టించేందుకు అమ‌ల గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో మంజు వారియ‌ర్ పోస్ట్ ఉమెన్ గా న‌టిస్తుంటే, అమ‌ల లాయ‌ర్ గా న‌టిస్తున్నార‌ట‌. మ‌ల‌యాళంలో అమ‌ల‌కి ఇది మూడో సినిమా కాగా, తెలుగు, హిందీ త‌ర్వాత రీ ఎంట్రీలోను మ‌ల్లువూడ్ మూడో ఇండ‌స్ట్రీ కావ‌డం విశేషం.

More News

ప్రయోగాలు వద్దంటున్న యంగ్ టైగర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన తర్వాత తదుపరి చిత్రం పై చాలా కేర్ తీసుకుంటున్నాడు.

విక్రమ్ తో ప్రయత్నాలు చేస్తున్నాడు....

విలక్షణ నటుడుగా ఈ తరం హీరోల్లో ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు.

ఇద్దరూ హాట్ అంటుంది....

ఇప్పుడు బోల్డ్ గా నటించడానికి రెడీ అవుతున్న రెజీనా మనసులో మాటలను కూడా బోల్డ్గానే చెబుతుంది.

తొలిసారి మహేష్ తో....

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో

అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం రిలీజ్ వాయిదా..!

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన హర్రర్ ఎంటర్ టైనర్ ఇంట్లో దెయ్యం నాకేం భయం.