మరి అఖిల్‌కు కిక్ ఇస్తాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ అంచనాల నడుమ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు ‘అఖిల్, హలో, మిస్టర్ మజ్ను’ చిత్రాలు బ్రేక్‌ను అందించలేకపోయాయి. ఇప్పుడు అఖిల్ తన ఆశలను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పైనే పెట్టుకున్నాడు. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే ఈ పాటికి సినిమా విడుదలై ఉండేది. కానీ.. కరోనా వల్ల సినిమా ఫైనల్ స్టేజ్ షూటింగ్ ఆగింది. ఈ సినిమా తర్వాత అఖిల్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే దానిపై క్లారిటీ లేకుండా ఉండింది. కొన్ని నెలల క్రితం అఖిల్ తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడితోనే చేస్తారని కూడా వార్తలు వినిపించాయి.
ఈ తరుణంలో తాజా సమాచారం మేరకు అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత సురేందర్ రెడ్డి.. మెగా హీరోలతో సినిమాలు చేయాలని చాలానే ప్రయత్నించాడు. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. ఆ తరుణంలో అఖిల్‌కు కథ చెప్పడం.. తనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని అంటున్నారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పెండింగ్ షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ సినిమాపై మరింత క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. పక్కా సమాచారం కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com