‘నేనెవరో తెలుసా’.. పోలీసులకు అఖిల వార్నింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ నేతలు తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పల్నాడులో మొదలైన రాజకీయ వేడి ఆత్మకూరుకు తాకేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుతో మంగళవారం సాయంత్రమే పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు గుంటూరు చేరుకున్నారు. రాత్రంతా గుంటూరులోని పలు హోటల్స్‌లో బస చేశారు.
ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హోటల్ నుంచి చలో ఆత్మకూరులో కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే ఆమె హోటల్ నుంచి బయటికి రావడానికి పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె పోలీసులపై కన్నేరజేశారు. వాళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులు అని చూడకుండా.. మహిళా పోలీసులను లెక్కలేకుండా మాట్లాడారు. అసలు నన్ను ఆపేందుకు హక్కు మీకు ఎవరిచ్చారు..? అసలు నేనెవరో తెలుసా.. తెలిసే మీరు ఇలా చేస్తున్నారా..?’ అని పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మరోవైపు.. అఖిల అనుచరులు మహిళా పోలీసులపై జులుం ప్రదర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments