నితిన్ హీరోయిన్‌తో అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని `అఖిల్` ఫలితంతో నిరాశకు లోనైనా తదుపరి చిత్రం 'హలోస నటుడిగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. ఇప్పుడు మూడో సినిమాగా 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడు.
ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. అందులో భాగంగా హీరోయిన్‌గా మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేశారని సమాచారం. లై, ఛల్ మోహన్‌రంగ సినిమాల్లో నటించిన మేఘా ఆకాశ్‌కు కూడా ఇది మూడో చిత్రమే. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com