అఖిల్ ఖాతాలో మరో దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల విడుదలైన హలో` చిత్రంతో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను మెప్పించాడు యువ కథానాయకుడు అక్కినేని అఖిల్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలుగు కథానాయకులు అందరూ ఒక సినిమా సెట్ మీద ఉండగానే.. మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కాని అఖిల్ హలో` చిత్రం విడుదలై దాదాపు రెండు నెలలు పూర్తయినా.. తదుపరి చిత్రం విశేషాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు.
అయితే.. ఈ గ్యాప్‌లో అఖిల్ తదుపరి సినిమాకి దర్శకుడిగా సుకుమార్ నుంచి అట్లి, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, కొరటాల శివ, బాబి, ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంజు వరకు చాలా పేర్లు వినిపించాయి. అయితే ఇప్పటికీ అఖిల్ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ రాలేదు. తాజాగా తొలిప్రేమ` వంటి యూత్‌ఫుల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ అట్లూరితో అఖిల్ తదుపరి చిత్రం ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ దర్శకులు వినిపించిన కథలు అఖిల్ కు నచ్చలేదో... లేకపోతే ఇవన్ని వదంతులో తెలియాలంటే అఖిల్ తన మూడో చిత్రాన్ని తొందరగా ప్రకటించాలని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com