రేస్ టు ఫినాలే విన్ అయిన అఖిల్.. ఓ మెట్టు ఎక్కిన అభి..
Send us your feedback to audioarticles@vaarta.com
నైట్ అంతా కూడా సొహైల్, అఖిల్ కూడా కూర్చొనే ఉన్నారు. మీరింకా ఈ టాస్క్‌ని కంటిన్యూ చేయాలనుకుంటే మీకు కావల్సిన సపోర్ట్ నేనిస్తానని అభి చెప్పాడు. నిజానికి ఈ మాట చెప్పి అభి ఒక మెట్టు ఎక్కాడు. సొహైల్ ఊయల నుంచి దిగడానికి సిద్ధమయ్యాడు. కానీ అఖిల్ పట్టుకుని ఆపాడు. అయినా కూడా సొహైల్ దిగిపోవడానికే సిద్ధమయ్యాడు. మనిద్దరం గట్టి వాళ్లమేనని కానీ ఏమైనా అనౌన్స్‌మెంట్లు వచ్చి ఇద్దరం కాకుండా పోతామేమోనని భయంగా ఉందని సొహైల్ చెప్పాడు. ఇద్దరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అఖిల్ కూడా నేను దిగిపోతానని చెప్పడంతో సొహైల్ వద్దని వారించాడు. సొహైల్ దిగిపోయాడు. దీంతో అఖిల్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇద్దరినీ అభి ఓదార్చిన తీరు కూడా బాగుంది. మొదట అఖిలే పుష్ మీ అన్నాడని.. నేను ఆ మాట అనలేక పోయానని అభికి చెప్పి సొహైల్ బాధపడ్డాడు. అఖిల్ మొదటి ఫైనలిస్ట్‌గా బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయితే ఫైనల్‌లో ఉంటావని చెప్పారు. అఖిల్.. సొహైల్ ఫోటోని కాల్చవద్దని బిగ్‌బాస్‌ను కోరాడు. అయినా కూడా కాల్చడంతో ఫీల్ అయ్యాడు. మొత్తానికి అఖిలే మొదటి ఫైనలిస్ట్ అయినప్పటికీ అతనికి మాత్రం ఆనందం లేకుండా పోయింది.
ఏదైనా చెబితే అర్థం చేసుకుని ఒక ఫ్రెండ్‌గా మంచి సజెషన్ ఇవ్వడం నీ బాధ్యత అని హారికకు అభి చెప్పాడు. అదంతా మర్చిపోవాలని హారిక చెప్పింది. అఖిల్.. నన్ను మొదటి వీక్‌లో జరిగిన దానికి నాలుగో వారంలో నామినేట్ చేశాడని అభి చెప్పాడు. ఫస్ట్ వీక్ నుంచి అఖిల్‌తో లొల్లి అవుతూ వస్తోందని హారికకు చెప్పాడు. అఖిల్ గురించి మాట్లాడుతుండగానే తనే వచ్చే అభికి థాంక్స్ చెప్పాడు. నువ్వు లేకుంటే అంతసేపు టాస్క్‌లో ఉండేవాళ్లం కాదని అభికి చెప్పాడు. రియల్ మ్యాంగో జ్యూస్ టాస్క్. సొహైల్‌తో గేమ్ స్టార్ట్ అయింది. ట్రూత్ ఆర్ డేర్ అంటే సొహైల్ డేర్ అన్నాడు. తరువాత అఖిల్, అవినాష్ కూడా అవుట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. అభి చేత మాత్రం తన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పించారు. టాస్క్ తర్వాత అవినాష్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం మొదలు పె్టాడు. కంటెస్టెంట్‌లందరి గురించి హరికథ రూపంలో చెప్పుకొచ్చాడు. అంతా హగ్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఇంతలోనే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టనే పెట్టారు. బిగ్‌బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌ని పరిగణలోకి తీసుకుని మీరు ఏ ర్యాంకులో ఉన్నారో ఎంచుకుని ఆ ర్యాంకుకు తాము ఎందుకు అర్హుడో చెప్పాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. అఖిల్ ఫినాలే మెడల్ పొంది ఫైనలిస్ట్ అయిన కారణంగా పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు. బజర్ మోగిన వెంటనే వెళ్లి ఒక నంబర్‌లో నిలబడాలని చెప్పారు. సొహైల్ మొదటి ర్యాంకులో.. అరియానా సెకండ్.. హారిక మూడవ.. మోనాల్ నాల్గవ.. అవినాష్ ఐదవ.. అభి ఆరవ ర్యాంకులో నిలబడ్డారు. లాస్ట్ వీక్ మిస్టేక్ చేసినందుకు తాను ఆరవ ర్యాంకులో నిలబడ్డానని ఆ మిస్టేక్ లేకుంటే ఫస్ట్ ర్యాంకులో ఉండేవాన్నని అభి చెప్పాడు. అవినాష్ తాను సెకండ్ ర్యాంకుకి అర్హుడినని ఫీల్ అవుతున్నట్టు చెప్పాడు. మోనాల్, హారిక పొజిషన్స్ మార్చుకున్నారు. పొజిషన్స్ ఎంచుకునే పరిస్థితుల్లో లేమని హారిక చెప్పాడు. సొహైల్ కూడా మేము ఎమోషనల్‌గా చాలా గ్రిల్ అయి ఉన్నామని చెప్పాడు. అందరం కలిసి ఇందాకే హగ్ చేసుకున్నామని సొహైల్ చెప్పాడు. సొహైల్ మొదటి ర్యాంకులో ఉన్న కారణంగా తను బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపకయ్యాడు. అభి ఆరవ ర్యాంకులో ఉన్న కారణంగా వరస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయ్యాడు. దీంతో అభిని జైలుకి పంపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com