అయ్యప్ప మాల వేసుకున్న అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని హీరోల్లో అఖిల్ అక్కినేనిని రీసెంట్గా చూసినవారు ఓరకంగా థ్రిల్ అయ్యారు. కారణం అఖిల్ అయ్యప్ప మాల వేసుకుని నల్లదుస్తుల్లో కనపడటమే అందుకు కారణం. సాధారణంగా మన హీరోల్లో భక్తి భావం కూడా ఎక్కువగానే ఉంటుంది. సినిమాలకు ఆ మధ్య గ్యాప్ తీసుకున్న నితిన్ అయ్యప్ప స్వామి దీక్ష చేశాడు. అలాగే నేటి తరం అగ్ర కథానాయకుల్లో ఒకరైన రామ్చరణ్ ప్రతి ఏడాది అయ్యప్పమాల వేసుకుంటాడు. ఈయన బాటలోనే శర్వానంద్ కూడా గత ఏడాది అయ్యప్ప మాల వేసుకున్నాడు. కాగా..ఇప్పుడు అఖిల్ కూడా అయ్యప్ప మాల వేసుకుని దీక్ష చేస్తున్నారు. సిటీకి వీలైనంత దూరంగా అఖిల్ దీక్షలో ఉన్నాడని అంటున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంపై అఖిల్ అక్కినేని భారీ అశలనే పెట్టుకున్నాడు. నిజానికి కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఈ సమ్మర్లోనే సందడి చేసేవాడు. కానీ ఇప్పుడు షూటింగ్ ఆగింది. మరెప్పుడూ మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com