అఖిల్‌ - వెంకీ అట్లూరి చిత్రం పేరు 'Mr. మజ్ను'

  • IndiaGlitz, [Wednesday,September 19 2018]

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'Mr. మజ్ను' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అఖిల్‌ తాతగారు డా.అక్కినేని నాగేశ్వరరావు 'లైలా మజ్ను'గా, తండ్రి కింగ్‌ నాగార్జున 'మజ్ను'గా నటించారు.

ఇప్పుడు అఖిల్‌ అక్కినేని 'Mr. మజ్ను'గా అందర్నీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను నటసామ్రాట్‌ డా. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌లో యూత్‌ కింగ్‌ అఖిల్‌ అక్కినేని స్టైలిష్‌ లుక్‌తో ఎంట్రీ ఇవ్వగా, 'దేవదాసు మనవడో.. మన్మథుడికి వారసుడో, కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో..' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే టైటిల్‌ సాంగ్‌తో టీజర్‌ మొదలవుతుంది.

'ఎక్స్‌క్యూజ్‌మి మిస్‌.. ఏమిటో ఇంగ్లీష్‌ భాష, దేన్నయితే మిస్‌ చేయకూడదో దాన్నే మిస్‌ అన్నారు' అంటూ అఖిల్‌ అక్కినేని చెప్పే డైలాగ్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. ఈ చిత్రంలో అఖిల్‌ అక్కినేని లుక్‌, స్టైల్‌, పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.