అఖిల్ కూడా అదే బాటలో వెళతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని కుటుంబంలో మూడో తరం కథానాయకుడుగా తెరంగేట్రం చేశాడు అఖిల్. తన పేరుతోనే రూపొందిన చిత్రం 'అఖిల్' తో హీరోగా తొలి అడుగులు వేసిన అఖిల్‌కి మొదటి సినిమా.. తీవ్ర నిరాశనే మిగిల్చింది. అందుకే రెండో సినిమా విషయంలో అచితూచి అడుగులు వేస్తున్నాడు. చివరాఖరికి ఆ సినిమా 'ఊపిరి'తో ప్రశంసలు పొందిన వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కనుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంతో అఖిల్ సక్సెస్ ట్రాక్‌లోకి రావడం ఖాయంగా సినిమా ప్రారంభానికి ముందే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తన అన్న నాగచైతన్య తరహాలో అఖిల్ తొలి చిత్రం కూడా ఫ్లాప్ కావడం ఎలాగైతే కామన్‌గా జరిగిందో.. చైతు రెండో సినిమా 'ఏ మాయ చేసావె' తరహాలో అఖిల్ చేయబోయే రెండో సినిమా ఏదైనా.. సెంటిమెంట్ ప్రకారం విజయం సాధించడం ఖాయంగా పరిశ్రమలో వినిపిస్తోంది. తొలి చిత్రంతో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పకడ్బందీగా ఉన్న అఖిల్.. రెండో సినిమా విషయంలో అన్న బాటలోనే వెళతాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments