అఖిల్ కూడా అదే బాటలో వెళతాడా?

  • IndiaGlitz, [Tuesday,March 29 2016]

అక్కినేని కుటుంబంలో మూడో త‌రం క‌థానాయ‌కుడుగా తెరంగేట్రం చేశాడు అఖిల్‌. త‌న పేరుతోనే రూపొందిన చిత్రం 'అఖిల్' తో హీరోగా తొలి అడుగులు వేసిన అఖిల్‌కి మొద‌టి సినిమా.. తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. అందుకే రెండో సినిమా విష‌యంలో అచితూచి అడుగులు వేస్తున్నాడు. చివ‌రాఖ‌రికి ఆ సినిమా 'ఊపిరి'తో ప్ర‌శంస‌లు పొందిన వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంతో అఖిల్ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావ‌డం ఖాయంగా సినిమా ప్రారంభానికి ముందే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త‌న అన్న నాగ‌చైత‌న్య త‌ర‌హాలో అఖిల్ తొలి చిత్రం కూడా ఫ్లాప్ కావ‌డం ఎలాగైతే కామ‌న్‌గా జ‌రిగిందో.. చైతు రెండో సినిమా 'ఏ మాయ చేసావె' త‌ర‌హాలో అఖిల్ చేయ‌బోయే రెండో సినిమా ఏదైనా.. సెంటిమెంట్ ప్ర‌కారం విజ‌యం సాధించ‌డం ఖాయంగా ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది. తొలి చిత్రంతో ఎదురైన అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని మ‌రింత ప‌క‌డ్బందీగా ఉన్న అఖిల్‌.. రెండో సినిమా విష‌యంలో అన్న బాట‌లోనే వెళ‌తాడేమో చూడాలి.

More News

రాజ్ తరుణ్ తో సందీప్ హీరోయిన్...

ఇప్పుడు వరుస విజయాల మీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు.

ఊపిరి కి ఫోర్బ్స్ పత్రిక అభినందన....

నాగార్జున-కార్తీ-తమన్నా కలిసి నటించిన ఊపిరి చిత్రం యు.ఎస్ లో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధిస్తుంది.గతంలో తెలుగు సినిమా యు.ఎస్ లో రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉండేది.

'అ..ఆ..'తోనైనా త్రివిక్రమ్ ట్రాక్ మారుస్తాడా?

మాటలతో మాయ చేయడం ఎంతబాగా తెలుసో..దృశ్యాలను కూడా ఆకట్టుకునేలా తీయడం రచయిత,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అంతే బాగా తెలుసు.

బాహుబ‌లి కి సి.ఎం, జ‌గ‌న్ అభినంద‌న‌లు..

తెలుగు సినిమా కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి రికార్డ్ స్ధాయిలో దాదాపు 600 కోట్లు వసూలు చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

బాహుబలి, కంచె చిత్రాలను ప్రశంసించిన దాసరి

63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ‘బాహుబలి’ ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు సాధించగా, రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘కంచె’ ఉత్తమ పాంతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది.