రేపు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన అక్కినేని అఖిల్.. ప్రస్తుతం మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ సర్‌ప్రైజ్‌ని రేపు ఇవ్వబోతున్నట్లు అఖిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బహుశా.. అది టీజర్‌కి సంబంధించిన విషయం కావచ్చని వినిపిస్తోంది.
కాగా, తాజాగా హలో చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ లీకైంది. అందులో టీజర్ ఫాస్ట్ సూన్ అని ఉంది. అంటే.. టీజర్‌కి సంబంధించే అఖిల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడన్నమాట.
నాగ్ ఈ టీజర్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com