అఖిల్ 3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

అక్కినేని అఖిల్ రెండ‌వ చిత్రాన్ని మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 4 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...అఖిల్ రెండ‌వ సినిమాతో పాటు 3వ సినిమాకి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.
స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి అఖిల్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే...అఖిల్ తో సురేంద‌ర్ రెడ్డి చేయ‌నున్న సినిమాని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ తొలిసారి నిర్మాత‌గా మారి ఖైదీ నెం 150 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఇదే బ్యాన‌ర్ లో అఖిల్ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో రామ్ చ‌ర‌ణ్ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని, దీనికి నాగ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం.

More News

కాటమరాయుడు మరో పోస్టర్ రిలీజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విదేశాల్లో మ‌హేష్ ఫ్యామిలీతో చ‌ర‌ణ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

ఆస్ట్రేలియా మోడల్ తో విష్ణు....

మంచు విష్ణు హీరోగా గీతాంజలి,త్రిపుర వంటి హర్రర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ లక్కున్నోడు.

చరణ్ విలన్ తో బాక్సర్....

సాలా ఖద్దూస్ చిత్రంతో రీల్ టైమ్ బాక్సర్ గా నటించిన రియల్ బాక్సర్ రితిక సింగ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.