నాగ్, జూనియర్లకు సర్ప్రైజ్ ఇచ్చిన అఖిల్!
Send us your feedback to audioarticles@vaarta.com
'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన యూత్‌పుల్ ఎంటర్టైనర్ 'మిస్టర్ మజ్ను'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు అక్కినేని ఫ్యామిలీ, జూనియర్ పలు ఆసక్తికర విషయాలు అభిమానులు, సినీ ప్రియులకు తెలియజేశారు.
అక్కినేని నాగ్, అఖిల్ స్టేజ్‌పై ఉండగా జూనియర్ ఎన్టీఆర్‌ను వేదికపైకి రావాలని పిలవడంతో ఆయన ముందుకొచ్చారు. ఈ సందర్భంగా నాగ్.. జూనియర్‌కు వెల్కమ్ చెప్పగా.. అఖిల్ నవ్వుతూ వచ్చి ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పాదం టచ్ చేయబోయారు. దీంతో నవ్వుతూ వద్దు వద్దు.. అంటూ చేయి ఊపుతూ జూనియర్ వేదికపై నిల్చున్నారు. ఈ సడన్ సర్‌ఫ్రైజ్‌తో ఆ కార్యక్రమానికి వచ్చిన నందమూరి, అక్కినేని అభిమానులు ఈలలు, కేకలు, జైఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అఖిల్ గురించి మాట్లాడిన జూనియర్.. "నా తమ్ముడు అఖిల్.." ఓ నటుడికి ముఖ్యంగా కావాల్సిన ఆత్మ విమర్శ అఖిల్‌లో ఉన్నట్లు ఎవరికీ ఉండదన్నారు. ఆత్మ విమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలని.. ఎన్నిసార్లు తనని తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ, తనని తాను మార్చుకుంటూ, తన పంథాని తాను మార్చుకుంటూ అఖిల్ ఈ మజిలీకి చేరాడు. 'అఖిల్ విల్ బి ఫైనెస్ట్ ఆర్టిస్ట్' అని అందరూ అనుకునేంత గొప్పనటుడు అవుతాడు.. నేను చెబుతున్నాను.. మీరు రాసి పెట్టుకోండి" అని జూనియర్ చెప్పుకొచ్చారు.
అయితే జూనియర్ చెప్పినట్లుగా జరిగితే అక్కినేని కుటుంబం, అభిమానుల్లో అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఇప్పటికే ప్లాప్‌లతో సతమవుతున్న అఖిల్‌కు కనీసం ఈ సినిమా అయినా టర్నింగ్ పాయింట్ అవుతుందా..? లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout