ఆగస్టు 12న అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఏజెంట్' రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
శుక్రవారంనాడు మేకర్స్ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు. `ఏజెంట్` చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్రదినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు. అంతేకాక ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో 4 రోజుల వీకెండ్ కూడా కలిసి వచ్చింది.
`ఏజెంట్`లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అతనిలోని సరికొత్త పార్శ్వం కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.
సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com