కొట్టుకునేంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది - అఖిల్ సక్సెస్ మీట్ లో నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడోతరం యువ కధానాయకుడు అఖిల్. సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో అఖిల్, సయేషా జంటగా నటించారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై యువ హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళీ కానుకగా అఖిల్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిల్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ...ఫస్ట్ డే దాదాపు 10 కోట్లు షేర్ కలెక్ట్ చేయడం గర్వంగా ఉంది. ఈరోజు కలెక్షన్స్ ఇంకా బాగుండడంతో చాలా సంతోషంగా ఉంది. నేను బి,సి సెంటర్స్ వెళ్లడానికి టైమ్ పట్టింది. ఫస్ట్ ఫిలిమ్ కే అఖిల్ బి,సి సెంటర్స్ కి వెళ్లాడు. న్యూకమర్ మూవీగా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వవలసి వస్తే 5 స్టార్స్ రేటింగ్ ఇస్తాను. ఫ్యాన్స్ కి మరీ మరీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
అఖిల్, నేను కొట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. నాకన్నా కోపం వస్తుందేమో కానీ అఖిల్, చైతన్యలకు అసలు కోపం రాదు. కొట్టుకునేంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది. నాన్నగారు డిక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పేవారు. ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు అఖిల్ డాన్స్ చూసి షాకయ్యాను. అమల మంచి డాన్సర్. ఆ జీన్స్ కూడా రావడంతో అఖిల్ అంత బాగా డాన్స్ చేస్తున్నాడు. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి గారు, నితిన్ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ...అఖిల్ మూవీకి ఎక్స్ ట్రార్డనరీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకి నాగార్జున గారి సాంగ్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియోన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అఖిల్ డాన్స్ అద్భుతంగా చేసాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ....అఖిల్ రోటీన్ స్టోరి కాదు ఎక్స్ పిరమెంటల్ మూవీ. అఖిల్ లోని టాలెంట్ ను చూపిస్తూ వినాయక్ గారు చాలా బాగా తీసారు. అఖిల్ బెస్ట్ ఏక్టర్, బెస్ట్ డాన్సర్, బెస్ట్ ఫైటర్...ఒకటేమిటి అన్నింటిలో బెస్ట్ అన్నారు.
నితిన్ మాట్లాడుతూ....డివైడ్ టాక్ ఉన్నప్పటికీ అన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండడం సంతోషంగా ఉంది. నాగార్జున గారు, అఖిల్ ఇద్దరు...కలసి డాన్స్ చేసినప్పుడు నేను నాగార్జున గారినే చూసాను అన్నారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ...ఈ సినిమా రిలీజ్ తర్వాత నాకు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...అఖిల్ మూవీకి ఫస్ట్ డే 9.8 కోట్లు షేర్ వచ్చింది. అండర్ వాటర్ లో ఎపిసోడ్ ఒక్కరోజులో చేసాం. ఏ హీరో అలా చేయలేడు. అఖిల్ సూపర్ స్టార్. మా సంస్థలో సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన నాగార్జన గార్కి, వినాయక్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
హీరోయిన్ సయేష మాట్లాడుతూ...అఖిల్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశించినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
హీరో అఖిల్ మాట్లాడుతూ...సెకండాఫ్ లో బ్రహ్మానందం గారితో ఉండే ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్రహ్మానందం గారితో వర్క్ చేసిన 14 రోజుల ఎక్స్ పీరియన్స్ ను మరచిపోలేను. నేను ఏం చేసినా ఫ్యాన్స్ కోసమే. ఈ సందర్భంగా అక్కినేని వంశాభిమానులందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com