సిక్స్ ప్యాక్‌లో అఖిల్‌...

  • IndiaGlitz, [Sunday,September 23 2018]

అక్కినేని మూడో త‌రం వార‌సుడిగా సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌నుకుంటున్న అఖిల్ అక్కినేని ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్లేబాయ్ పాత్ర‌లో అఖిల్ న‌టిస్తున్నాడు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ చాలానే క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు.

జిమ్‌లో అఖిల్ తీసుకున్న సిక్స్ ప్యాక్ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు అఖిల్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌లో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో మూడో వారం సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు నిర్మాత‌లు.