అఖిల్, శ్రియాల పెళ్లి ఆగిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్, ష్యాషన్ డిజైనర్ ప్రముఖ వ్యాపారవేత్త జి.వి.కె మనవరాలు శ్రియా భూపాల్ మధ్య గత ఏడాది డిసెంబర్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఇటలీలో వీరి వివాహం జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే లెటెస్ట్‌గా వీరి వివాహం ఆగిపోయిందంటూ వార్తలు వినపడుతున్నాయి కానీ కచ్చితమైన కారణాలు మాత్రం తెలియడం లేదు.
ఓ ప్రముఖ ఆంగ్లపత్రికలో దీని గురించి న్యూస్ కూడా వచ్చింది. ఈ న్యూస్‌ను ఖండిస్తూ రెండు కుటుంబాల వైపు నుండి ఎటువంటి న్యూస్ బయటకు రావపోవడంతో ఇది నిజమేనని అందరూ నమ్ముతున్నారు. రీసెంట్గా జరిగిన నాగచైతన్య, సమంతల నిశ్చితార్థానికి కూడా ఇరువురు కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి న్యూస్ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout