సుశాంత్ సాంగ్ లో అఖిల్ స్టెప్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఆటాడుకుందాం..రా! జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ మ్యూజిక్ అందించిన ఆటాడుకుందాం...రా ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈరోజు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆటాడుకుందాం...రా టైటిల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో అఖిల్ డ్యాన్స్ విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందట. చైతు, అఖిల్ గెస్ట్ రోల్ చేయడంతో ఈ మూవీపై మరింత క్రేజ్ పెరిగింది. భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఆటాడుకుందాం...రా చిత్రాన్ని ఈనెల 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments