తన రెండో చిత్రం వార్తల పై స్పందించిన అఖిల్..
- IndiaGlitz, [Thursday,May 05 2016]
అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే...ఈ చిత్రం గురించి గత రెండు రోజులుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే....అఖిల్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలని ప్లాన్ చేసింది.
అయితే... ఈ ప్రాజెక్ట్ కి 40 కోట్లు బడ్జెట్ అవుతుండడంతో....అఖిల్ పై అంత బడ్జెట్ పెట్టడం కరెక్ట్ కాదని భావించి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అంటూ కొన్ని వెబై సైట్స్ లో వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై అఖిల్ ట్విట్టర్ లో స్పందిస్తూ....ఆ వెబ్ సైట్స్ కి ఇన్ ఫర్మేషన్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియడం లేదు. వాళ్లు నా రెండో సినిమా గురించి తప్పుడు సమాచారాన్నిఅందించారు. నా రెండో చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయడం లేదు అని తెలియచేసారు. దీంతో ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలిసింది. అఖిల్ రెండో చిత్రాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.