అఖిల్ టైటిల్

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ త‌న రెండో సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. 13బి, మ‌నం చిత్రాల ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాకు 'జున్ను' అనే టైటిల్ విన‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్‌లో జ‌రుగుతోంది. ఇంకా ప్రారంభం కానీ హైద‌రాబాద్ మెట్రోలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న మొద‌టి చిత్రం అఖిల్‌దే కావ‌డం విశేషం.