అఖిల్ సెకండ్ మూవీ లాంఛింగ్ డీటైల్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ తన రెండో చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.
అఖిల్ ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9న హైదరాబాద్ లో జరగనుంది. ఆతర్వాత ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో... మాకు అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జనవరి నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి డైలాగ్స్ హర్షవర్ధన్ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com