అఖిల్ సెకండ్ & థ‌ర్డ్ మూవీ క‌న్ ఫ‌ర్మ్..

  • IndiaGlitz, [Friday,June 10 2016]

అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన తొలి చిత్రం అఖ‌ల్ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. దీంతో అఖిల్ సెకండ్ మూవీ ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. నాగార్జున కూడా వంశీ పైడిప‌ల్లితో క‌థ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు చెప్పారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం... అఖిల్ కి ఇటీవ‌ల హ‌ను రాఘ‌వ‌పూడి ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఈ క‌థ అఖిల్ కి న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ త్వ‌ర‌లో రానుంది. అలాగే హ‌ను రాఘ‌వ‌పూడి త‌ర్వాత అఖిల్ మూడో చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ట‌. ఈ విష‌యాల్ని ఇటీవ‌ల విజ‌య‌వాడ వెళ్లిన‌ప్పుడు అఖిల్ స్వ‌యంగా అభిమానుల‌తో పంచుకున్న‌ట్టు సమాచారం.