అఖిల్ సేఫ్.. మెడల్ వేసిన సొహైల్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘కాటుక కనులే.. ’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నిన్న ఏం జరిగిందో చూశారు. మోనాల్‌ని ఆట పట్టిస్తూ అఖిల్ పాటలు పాడుతున్నాడు. అమ్మాయిలతో పెద్దగా మాట్లాడని నేను.. నీ వల్లే ఫ్లర్ట్ చేయాల్సి వస్తోందని చెప్పాడు. ఈ వీక్‌లో హగ్ లివ్వడం ఎక్కువైందని మోనాల్ చెప్పింది. అవినాష్, అరియానా.. మా జంట బాగుందా? అని అవినాష్ అడుగుతున్నాడు. అరియానాతో స్టార్టింగ్‌లో నిన్నెందుకు చూడలేదు అరియానా అని అన్నాడని అరియానా చెప్పింది. ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని సొహైల్ ఫన్ చేశాడు. అభి శిక్షా కాలం పూర్తైందని బిగ్‌బాస్ చెప్పారు. ఎంటీఆర్ తెలుగు రుచులు వారి టాస్క్. ఈ టాస్క్ తర్వాత హైజెనిక్స్ టాస్క్ ఇచ్చారు. అరియానా, అభి సంభాషణలో ఐ లవ్ మై సెల్ఫ్ అని అరియానా చెప్పింది. ఇది వింటే అవినాష్ ఏం ఫీలవుతాడో అని అభి అన్నాడు. అవినాష్‌కి ఇలాంటివి అర్థం కావులే అని అరియానా ఫన్నీగానే అన్నది. అది విన్న అవినాష్ చాలా ఫైర్ అయ్యాడు. నాకు అర్థం కాకపోతే ఈ స్థాయికి రానని అవినాష్.. చిన్నపాటి యుద్ధమే జరిగింది.
ఎందుకంత కోపం వస్తోంది.. ముట్టుకుంటే ఏడ్చేలా ఉన్నారు. బాగా స్ట్రెస్‌లో ఉన్నారు.. కారణం ఏంటని నాగ్ అడిగారు. మీరే చెప్పండి. ఇక్కడ చెప్పినా పర్వలేదు.. కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి చెప్పమన్నారు. ముందుగా అవినాష్ కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి చెబుతానని పాలు పట్టే టాస్క్‌లో మోనాల్ ఇష్యూ.. అఖిల్, సొహైల్ ఇష్యూ అంతా వివరించాడు. అందరూ కలిసి నన్ను సింగిల్ చేశారని అవినాష్ చెప్పాడు. మళ్లీ ఆ వీడియో మొదట ప్లే చేసి చూపించి.. తరువాత స్లో మోషన్‌లో చూపించారు. మోనాల్ ఇన్‌టెన్షనల్‌గా తన్నిందని అఖిల్ తప్ప మిగిలిన వాళ్లంతా చెప్పారు. తరువాత నాగ్.. అవినాష్‌కి మోనాల్‌తో సారీ చెప్పించారు. అవినాష్ డౌట్స్ అన్నీ నాగ్ క్లారిఫై చేశారు. తరువాత అభి.. లాస్ట్ వీక్ చేసింది చాలా రాంగ్ అని చెప్పాడు. అది అంతా అయిపోయింది వదిలెయ్యమని నాగ్ చెప్పారు. అభికి ఫుల్‌గా బూస్ట్ ఇచ్చి నాగ్ పంపించారు. తరువాత సొహైల్ ఊయలలో 22 గంటలు కథలు పడ్డామని చెప్పాడు. ఫైనల్‌గా బాగా ఎమోషనల్ అయ్యామని చెప్పాడు. ప్రేక్షకులకు అఖిల్ గెలిచాడని.. అయితే సొహైల్ ప్రేక్షకుల మనసులు గెలిచాడన్నట్టు చెప్పారు. సొహైల్ చాలా హ్యాపీ ఫీలయ్యాడు. తరువాత మోనాల్.. కన్ఫెషన్ రూమ్‌కి వచ్చింది. మూడు వారాలుగా కంటిన్యూగా నామినేషన్‌లో ఉన్నానని చెప్పింది. అవినాష్ ఇష్యూ గురించి ప్రతి ఒక్కరికీ తన తప్పులేదని చెబుతున్నా తననెవరూ నమ్మట్లేదని చెప్పింది. మోనాల్‌ని కూల్ చేసి నాగ్ పంపించేశారు.
టికెట్ టు ఫినాలే మెడల్ ఎవరితో వేయించుకుంటావని నాగ్ అడిగారు. సొహైల్‌తోనే వేయించుకుంటానని అఖిల్ చెప్పాడు. అయితే ముందుగా నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వాలని నాగ్ ఆపారు. ఒక్కొక్కరి ఫీలింగ్ ఎలా ఉందో నాగ్ అడిగి తెలుసుకున్నారు. తరువాత అఖిల్‌ని నాగ్ సేఫ్ చేశారు. యు ఆర్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పారు. అంతా అభినందించారు. బిగ్‌బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అఖిల్ అని నాగ్ ప్రకటించారు. తరువాత సొహైల్ మెడల్ వేశాడు. స్టిక్స్ ఇచ్చారు. ఒక్కొక్క స్టిక్‌ని విరగ్గొట్టి ఆటలో ముందుకెళ్లడానికి హౌస్‌లో అడ్డుపడుతున్న బంధం ఎవరని అడిగారు. అరియానా స్టిక్ విరగ్గొట్టి సొహైల్ అని చెప్పింది. అభి.. హారిక పేరు చెప్పి స్టిక్‌ని విరగ్గొట్టాడు. తరువాత హారిక.. మోనాల్ పేరు చెప్పి స్టిక్ విరగ్గొట్టింది. అవినాష్.. అందరి పేర్లూ చెప్పాడు. ఆరు ముక్కలు చెయ్యి అని నాగ్ చెప్పారు. ఆరు ముక్కలు చేసి ఒక్కొక్కరికి ఒక్కో ముక్క ఇచ్చాడు. మోనాల్.. హారిక పేరు చెప్పి స్టిక్ విరగ్గొట్టింది. అఖిల్.. మోనాల్ పేరు చెప్పి విరగ్గొట్టాడు. ఇక సొహైల్.. కూడా అందరి పేర్లూ చెప్పి స్టిక్ విరిచేశాడు. మొత్తానికి స్పాంటీనియస్ పంచ్‌లతో నాగ్ ఇవాల్టి షోని అదరగొట్టేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments