మలయాళ రీమేక్ లో అఖిల్....
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోవడంతో తదుపరి సినిమా విషయంలో అక్కినేని అఖిల్ ఇంకా కేర్ తీసుకుంటున్నాడు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుందని వార్తలు వినిపించినా కథ చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దాంతో అఖిల్ సినిమాపై చాలా రకాలుగా వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఓ మలయాళ సినిమా రీమేక్ కోసం నిర్మాతలు అఖిల్ ను సంప్రదించడానికి రెడీ అవుతున్నారట. రీసెంట్ గా మలయాళంలో విడుదలైన యాక్షన్ ఎంటర్ టైనర్ కమ్మటి పడం చిత్రంకు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అఖిల్ తో, మలయాళంలో అర్జున్ కపూర్ తో నిర్మించాలనుకుంటున్నారట. అయితే మరి ఈ సినిమా చేయడానికి అఖిల్ ఏ మేర ఆసక్తి చూపిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com