నాడు 'ఢమరుకం'.. నేడు 'అఖిల్'..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, అనుష్క జంటగా నటించిన 'ఢమరుకం' సినిమా గుర్తుందిగా.. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ సోషియో ఫాంటసీ.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం పొందింది. 2012లో.. నాగచైతన్య పుట్టినరోజు కానుకగా నవంబర్ 23న రిలీజైన 'ఢమరుకం' తరువాత.. ఆ కుటుంబం నుంచి వస్తున్న మరో సోషియో ఫాంటసీ చిత్రం 'అఖిల్'.
ఈ చిత్రం ద్వారానే నాటి 'సిసింద్రీ' అఖిల్.. హీరోగా తొలి అడుగులు వేస్తున్నాడు. విశేషమేమిటంటే.. 'ఢమరుకం' రిలీజైన నవంబర్‌లోనే అఖిల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఢమరుకం' లాభాల పంట పండించలేకపోయింది.. ఆ లోటుని 'అఖిల్' అయినా తీరుస్తుందేమో చూడాలి. నవంబర్ 11న రానున్న 'అఖిల్'కి వి.వి.వినాయక్ దర్శకుడు కాగా.. నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com