అఖిల పని అయిపోయినట్లేనా.. రంగంలోకి మౌనిక!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కిడ్నాప్ ఉదంతంతో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డంగా బుక్ అయిపోయారు. బాలీవుడ్ సినిమాను చూసి.. అదే ఫక్కీలో కిడ్నాప్ చేసి.. కొన్ని గంటల్లోనే దొరికిపోయి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం ఆళ్లగడ్డ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె జైలులో ఉండటాన్ని అధికార పార్టీ అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఈ కిడ్నాప్ వ్యవహారంతో అఖిల ప్రియ రాజకీయ భవిష్యత్‌కు మాత్రం ఫుల్ స్టాప్ పడినట్టేనని తెలుస్తోంది. మరి పార్టీ క్యాడర్ పరిస్థితేంటి? తమ అనుచరుల మాటేంటి? దీంతో అఖిల ప్రియ సోదరి మౌనిక రంగంలోకి దిగారు.
అఖిల ప్రియ పని అయిపోయినట్లేనని అనుకుంటున్న తరుణంలో.. మౌనిక రంగంలోకి దిగారు. కార్యకర్తలకు నిత్యం టచ్‌లో ఉంటూ.. పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు యత్నిస్తున్నారు. అఖిల ప్రియ మంత్రిగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేదని నియోజకవర్గంలో టాక్ బలంగా వినబడుతోంది. అందుకే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ కేసులు కూడా తోడవ్వడంతో అంతే సంగతులు. అందుకే ఇప్పట్నుంచే మౌనిక అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటోంది. ఆళ్లగడ్డ నుంచి నెక్ట్స్ మౌనికనే అభ్యర్థి అనేంతగా ఆమె కార్యకర్తలు, అనుచరులతో మమేకమవుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ఉండటంతో మౌనిక అంతా తానై వ్యవహరిస్తున్నారు.
నిజానికి అఖిలప్రియ జైలు పాలవడం అధికార పార్టీకి బాగా కలిసొచ్చే అంశంగా పరిణమించింది. అయితే భూమా కుటుంబానికి ఆళ్లగడ్డలో మంచి పట్టుంది. ఈ పట్టును నిలుపుకునేందుకే మౌనిక ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఆళ్లగడ్డ వెళ్లిన ఆమె ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. అఖిలప్రియ జైలుకు వెళ్లారని అధైర్యపడవద్దని.. తానున్నానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏ చిన్న సమస్య వచ్చినా తనకు నేరుగా కాల్ చేయవచ్చని.. వెంటనే తానుస్పందిస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే అఖిల ప్రియ కోర్టులు.. కేసులంటూ పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఉంటే ఈ కేసుల నుంచి బయటపడటం కష్టమని భావించి బయటకు వస్తారో.. లేదంటే తాడో-పేడో ఆపార్టీలో ఉండే తేల్చుకుందామని భావిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments