మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న అఖిల్

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందినా, హిట్ కోసం మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది అఖిల్ అక్కినేనికి. ఈసారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలను మొదలేట్టేశారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, 'అ!', 'కల్కి' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ అఖిల్ తదుపరి సినిమాను డైరెక్ట్ చేస్తారని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయట. అన్ని పూర్తి కాగానే, సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తారని టాక్. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తారట. అఖిల్ లుక్ ‌కూడా కొత్తగా ఉంటుందని సమాచారం.