నాగ్, పూరి మధ్యలో కళ్యాణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున.. అఖిల్ రెండో సినిమా బాధ్యతను ఏ డైరెక్టర్ కి అప్పచెప్పాలనే విషయం పై చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ లో కొంత మంది బిజీగా ఉన్నారు. మరి కొంత మంది ఖాళీగా ఉన్నా...సక్సెస్ లో లేక వాళ్ళతో చేయడం ఇష్టం లేదు. మరి..ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బాగుంటారనుకుంటే..ఇక చివరి ఆప్షన్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.
నిర్మాత సి.కళ్యాణ్ పూరి తో జ్యోతిలక్ష్మి లోఫర్ సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే కళ్యాణ్ అఖిల్ సినిమాని తమిళ్ లో రిలీజ్ చేసాడు. నాగ్ తో సి.కళ్యాణ్ కి మంచి అనుబంధమే ఉంది. ఈ నెల 17న లోఫర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి అఖిల్ రెండో సినిమాని డైరెక్ట్ చేయమని పూరి ని అడగాలా వద్దా అనేది ఆలోచిస్తారట. అయితే అఖిల్ సినిమా గురించి నాగ్, పూరి మధ్యలో నిర్మాత సి.కళ్యాణ్ చర్చలు జరపనున్నారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com