అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే..
Friday, May 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవడంతో రెండవ చిత్రం ఏ డైరెక్టర్ తో..? ఏతరహా చిత్రం చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది. అయితే అఖిల్ రెండవ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వచ్చాయి.
నాగార్జున కూడా అఖిల్ - వంశీ పైడిపల్లి కథ గురించి మాట్లాడుకుంటున్నారు. వారిద్దరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను ఫైనల్ చేసి ఎనౌన్స్ చేస్తాను అన్నారు.అయితే.. రీమేక్ చేద్దామని అఖిల్..కాదు కొత్త కథతో చేద్దాం అని వంశీ..ఇలా వీరిద్దరికి అభిప్రాయబేధాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. తాజా సమాచారం ప్రకారం అఖిల్ మలయాళంలో విజయం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించనున్నారు. ఇదే కనుక నిజమైతే...అఖిల్ ఈసారి విజయం సాధించడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments