అఖిల్ కు వంశీయేనా..?
- IndiaGlitz, [Thursday,March 03 2016]
తొలి చిత్రం మున్నా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వంశీపైడిపల్లి ఏ మాత్రం కంగారు పడకుండా ఎన్టీఆర్ తో బృందావనం వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సక్సెస్ సాధించాడు. తర్వాత ఎవడు చిత్రంతో మరో కమర్షియల్ హిట్ కూడా సాధించాడు. అయితే ఎవడు చిత్రాన్ని చూసినవారు హలీవుడ్ మూవీ ఫేస్ ఆఫ్ ను చక్కగా అడాప్ట్ చేశాడని అన్నారు.
అలాగే ఇప్పుడు వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసిన ఊపిరి చిత్రాన్ని కూడా ఫ్రెంచ్ మూవీ ఇన్ టచ్ బుల్స్ నుండి అడాప్ట్ చేసుకున్నాడు. నాగార్జున, కార్తీలు కూడా వంశీ మూవీని మన నెటివిటీకి తగిన విధంగా చక్కగా అడాప్ట్ చేశాడని మెచ్చుకున్నారు. సినిమా పక్కగా హిట్ అవుతుందని అన్న నాగార్జున తన రెండో తనయుడు అఖిల్ సెకండ్ మూవీ హే జవానీ హై దివానీని తెలుగులో రీమేక్ కు వంశీ చేయాలని అనుకుంటున్నాడట. అందుకు వంశీతో చర్చలు కూడా జరుగుతున్నాయట. వంశీ పెద్ద స్టార్స్ తో సినిమా సరేసరి రీమేక్ దర్శకుడనే పేరు తెచ్చేసుకుంటాడేమో కూడా ఆలోచిస్తే మంచిది.