డెబ్యు డైరెక్టర్‌తో అఖిల్ మల్టీస్టారర్ మూవీ?!
Send us your feedback to audioarticles@vaarta.com
‘నువ్వు నేను’ లాంటి సూపర్ హిట్ ఫిల్మ్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి.. ‘సంతోషం’ సినిమాతో స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారారు గోపీమోహన్. ఆ తర్వాత శ్రీనువైట్ల, కోన వెంకట్‌తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసారు. అంతే కాకుండా.. ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్‌షా’, ‘డిక్టేటర్’ లాంటి చిత్రాలతో పాటు ఎన్నో సినిమాలకు స్టొరీ రైటర్‌గా పని చేసిన అనుభవం గోపీమోహన్‌ది. ఇప్పుడు ఆ అనుభవంతోనే ఈ రైటర్.. డైరెక్టర్‌గా తొలిసారి మెగాఫోన్ పట్టనున్నారు.
ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోలకి సంబంధించిన ఓ కథను సిద్ధం చేసుకున్నారట. ఆ ముగ్గురు హీరోలతో ఓ మల్టీస్టారర్ మూవీని చేయడానికి నిశ్చయించుకున్నారట. ఈ క్రమంలో ఒక హీరోగా నాగశౌర్యతో కథా చర్చల్లో ఉండగా.. మెయిన్ హీరోగా అక్కినేని అఖిల్‌ను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ మేరకు తన పాత్రకు సంబంధించి మరింత క్లారిటీ కావాలని అఖిల్ కోరుతూనే.. కొన్ని మార్పులు కూడా సూచించారని చెబుతున్నారు. ఇప్పుడు అఖిల్ కోరిన విధంగా మార్పులు చేయడానికి.. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఈ టాలెంటెడ్ రైటర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనల్ స్క్రిప్ట్ అఖిల్‌కు నచ్చినట్లయితే.. త్వరలోనే గోపీమోహన్ మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంతా అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com