డెబ్యు డైరెక్టర్‌తో అఖిల్ మల్టీస్టారర్ మూవీ?!

  • IndiaGlitz, [Saturday,June 30 2018]

‘నువ్వు నేను’ లాంటి సూపర్ హిట్ ఫిల్మ్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి.. ‘సంతోషం’ సినిమాతో స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారారు గోపీమోహన్. ఆ తర్వాత శ్రీనువైట్ల, కోన వెంకట్‌తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసారు. అంతే కాకుండా.. ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్‌షా’, ‘డిక్టేటర్’ లాంటి చిత్రాలతో పాటు ఎన్నో సినిమాలకు స్టొరీ రైటర్‌గా పని చేసిన అనుభవం గోపీమోహన్‌ది. ఇప్పుడు ఆ అనుభ‌వంతోనే ఈ రైటర్.. డైరెక్టర్‌గా తొలిసారి మెగాఫోన్ పట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోలకి సంబంధించిన ఓ కథను సిద్ధం చేసుకున్నారట‌. ఆ ముగ్గురు హీరోలతో ఓ మల్టీస్టారర్ మూవీని చేయడానికి నిశ్చయించుకున్నారట‌. ఈ క్రమంలో ఒక హీరోగా నాగశౌర్యతో కథా చర్చల్లో ఉండగా.. మెయిన్ హీరోగా అక్కినేని అఖిల్‌ను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ మేరకు తన పాత్రకు సంబంధించి మరింత క్లారిటీ కావాలని అఖిల్ కోరుతూనే.. కొన్ని మార్పులు కూడా సూచించారని చెబుతున్నారు. ఇప్పుడు అఖిల్ కోరిన విధంగా మార్పులు చేయడానికి.. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఈ టాలెంటెడ్ రైటర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనల్ స్క్రిప్ట్ అఖిల్‌కు నచ్చినట్లయితే.. త్వరలోనే గోపీమోహన్ మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంతా అంటున్నారు.

More News

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైన 'ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌' ఆడియో

జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై  శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌ప‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్ గా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస రావు ద‌ర్శ‌క‌త్వం.

ఆ చిత్రాల స‌ర‌స‌న 'తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రం నిలుస్తుంది - నిర్మాత కె ఎస్ రామారావు

1967లో ఇండస్ట్రీలోకి ప్రవేశించి ప్రముఖ దర్శకుడు కె స్ ప్రకాష్ రావు వద్ద 'బందిపోటు దొంగలు' చిత్రానికి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి కెరీర్‌ని ప్రారంభించారు కె స్ రామారావు.

పాట పాడుకుంటున్న ర‌వితేజ‌, ఇలియానా

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోవా బ్యూటీ ఇలియానా జంట‌గా న‌టించిన కిక్ చిత్రం ఎంత పెద్ద హిట్ట‌య్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

'విశ్వామిత్ర' లో నందితా

'గీతాంజలి, త్రిపుర' వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు.

'అల్లరి నరేష్' - ఏకె ఎంటర్టైన్మెంట్స్' సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి

హీరో "అల్లరి నరేష్", నిర్మాత అనిల్ సుంకరల కాంబినేషన్‌లో ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి  "నందిని నర్సింగ్ హోమ్"