'మిస్టర్ మజ్ను' వాయిదా?
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ మూడో సినిమా `మిస్టర్ మజ్ను`. `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమాను లండన్‌లో 45 రోజుల పాటు చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ప్లే బాయ్ క్యారెక్టర్‌లో అఖిల్ అక్కినేని నటిస్తున్నారు.
ఈ సినిమాను అక్కినేని లక్కీ మంత్ డిసెంబర్‌లో... డిసెంబర్ 21న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజున వరుణ్ తేజ్ `అంతరిక్షం`, శర్వానంద్ `పడి పడి లేచె మనసు` సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో పాటు కొన్ని అనువాద చిత్రాలు కూడా లైన్‌లో ఉండటంతో మిస్టర్ మజ్నుని ఫిబ్రవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments