కొత్త ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

  • IndiaGlitz, [Thursday,February 01 2018]

కింగ్ నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు అప్పగించారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై.. 'అఖిల్' చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించక పోవడంతో..రీ-లాంచింగ్ అంటూ అఖిల్ రెండో సినిమాని బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ చేతిలో పెట్టారు నాగార్జున.

'హలో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా..స్వయంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మ‌రీ నాగ్‌ సొంత సంస్థలో నిర్మించినప్పటికీ.. అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాని లుక్స్ పరంగా, నటన పరంగా 'హలో' చిత్రంతో అభిమానులను కొంత వరకు సంతృప్తి పరిచాడు అఖిల్.

ఇక ఇప్పుడు అఖిల్ మూడవ సినిమా విష‌యంలో ఆలోచనలో పడ్డ నాగార్జునకి..రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త‌ డైరెక్టర్‌ని పరిచయం చేసారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ డైరెక్టర్ ప్రతిభ, నైపుణ్యం గురించి నాగ్‌తో చెప్పిన వర్మ.. అఖిల్‌ మూడవ సినిమా తనతో తీస్తే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారని సమాచారం. మరి వర్మ సలహాకి నాగ్ ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న'గాయత్రి'

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న 'గాయత్రి' చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది. మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స&#

అ! ట్రైలర్ చూడగానే సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది - ఎస్.ఎస్. రాజమౌళి

నేచరల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై రూపొందుతున్న చిత్రం 'అ!'.

వేసవి నుంచి మహేష్ , సందీప్ చిత్రం?

ఒకే ఒక్క చిన్న సినిమాతో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.

ప్రతిభావంతుడికి సాయిధరమ్‌ తేజ్‌ సాయం

సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్‌ యాదవ్‌ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్‌ నరేష్‌ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ నెల 31న ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం చదవి వెంటనే హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు.

మార్చి1 నుండి తెలంగాణ, ఏపీ లోని థియేటర్ల మూసివేత

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి  అధ్య‌క్షులు పి. కిర‌ణ్, సెక్ర‌ట‌రీలు ఎమ్ . రామ‌దాసు, కె. శివ‌ప్ర‌సాద‌రావు, తెలంగాణ రాష్ర్ట ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు కె. ముర‌ళీ మోహ‌న్, సెక్ర‌టరీ సునీల్ నారంగ్ , ద‌క్షిణాది ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు ఎల్. సురేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీ రవి కొట్ట‌రాక‌ర‌, త‌మిళ సినిమా నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశ