ప్రసాద్ ఐమాక్స్ లో అఖిల్ , వి.వి.వినాయక్ ల 'అఖిల్'
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అఖిల్'. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో బిగ్ స్క్రీన్‌పై ప్రతిరోజూ 5 షోస్ ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత నితిన్ మాట్లాడుతూ - ''ఎన్నో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య 'అఖిల్' చిత్రాన్ని నవంబర్ 11న దీపావళి కానుకగా హయ్యస్ట్ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాము. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఒక విజువల్ వండర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై ప్రతిరోజూ 5 షోలు ప్రదర్శించబోతున్నార. ఇలాంటి విజువల్ వండర్‌ని బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆడియన్స్‌కి చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. అందుకే ఆడియన్స్ బిగ్ స్క్రీన్‌పై చూడాలన్న ఉద్దేశంతో ఐమాక్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాం. అలాగే ఈ చిత్రాన్ని యు.ఎస్.లో 168 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది'' అన్నారు.
ఇటీవల విడుదలైన ప్రభాస్, రాజమౌళిల విజువల్ వండర్ 'బాహుబలి' చిత్రం కూడా ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శింపబడి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్, వినాయక్‌ల 'అఖిల్' చిత్రం ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై ప్రతిరోజూ 5 షోలు ప్రదర్శింపబడడం విశేషం.
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతోపాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments