అఖిల్ తో ఆలోచనలో పడ్డ బాలయ్య.....
- IndiaGlitz, [Wednesday,June 15 2016]
అక్కినేని వంశం మూడోతరంలో తెలుగు తెరకు పరిచయమైన మరో యువ కథానాయకుడు అఖిల్. సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇటు నాగార్జున, అఖిల్, అటు అభిమానులు కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అసలు అఖిల్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే...తొలి చిత్రానికే ప్రపంచాన్ని కాపాడే కథను ఎంచుకోవడమే అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నాగార్జున స్వయంగా అఖిల్ కి చెప్పారట. ప్రపంచాన్ని కాపాడే కథలు చేయడానికి నీకు చాలా టైమ్ ఉంది అని.
ఇలాంటి విషయాన్నే నాగార్జున అందరి ముందు చెప్పారు. అది ఎప్పుడు అంటారా..? సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ డెబ్యూ ఏక్టర్ గా అఖిల్ కి వచ్చిన అవార్డ్ ను చిరంజీవి చేతుల మీదుగా నాగార్జున అందుకున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...ఈ అవార్డ్ ను చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకున్నాను అని అఖిల్ కి చెబుతాను. అప్పుడైనా చిరంజీవి గారి నుంచి లెసెన్స్ నేర్చుకుంటాడు అని అనుకుంటున్నాను అన్నారు. నాగార్జున తన కొడుకు తన నుంచి కాకుండా తన తోటి హీరో నుంచి లెసెన్స్ నేర్చుకుంటాడని అందరి ముందు చెప్పడం నాగార్జున గొప్పతనం. తన మనసులో మాట ఎలాంటి ఈగో లేకుండా బయటపెట్టారు. దానికి కారణం ఏమిటంటే...చిరంజీవికి ఇంతటీ క్రేజు, ఇమేజు రావడానికి కారణం అతను ఎంచుకున్న పాత్రలే. స్వయంకృషి, దొంగమొగుడు, కొండవీటి రాజా, ముఠామేస్త్రి...ఇలా అతని పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము చూసుకున్నారు. అందుకనే చిరంజీవి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే నాగార్జున చిరు నుంచి అఖిల్ పాఠాలు నేర్చుకోవాలి అన్నారు.
ఇదిలా ఉంటే...నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే..బాలయ్య కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సో..బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే...ఆ సినిమాలో మాస్ ఆడియన్స్ మెచ్చేలా యాక్షన్ ఉంటుందని ఆశిస్తారు. అయితే..అఖిల్ మూవీ ఇచ్చిన రిజల్ట్ తో బాలయ్య ఆలోచనలో పడ్డారట. మోక్షజ్ఞ తొలి చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండకూడదని బాలయ్య నిర్ణయం తీసుకున్నారట. టీనేజ్ కి తగిన కథతో మోక్షజ్ఞ తొలి చిత్రం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి అఖిల్ మూవీ అఖిల్ కే కాకుండా చాలా మందికి ఎలాంటి సినిమా చేయాలి..? ఎలాంటి సినిమా చేయకూడదో తెలియచెబుతూ ఒక పాఠంలా ఉపయోగపడుతుండడం విశేషం.