'ఆటాడుకుందాం..రా' ఫస్ట్‌లుక్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీ జి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). అఖిల్ బాలనటుడిగా నటించిన 'సిసింద్రీ' చిత్రంలోని 'ఆటాడుకుందాం.. రా..' అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో సుశాంత్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను అఖిల్ అక్కినేని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల మాట్లాడుతూ - ''60 శాతం షూటింగ్ పూర్తయింది. సినిమా చాలా బాగా వస్తోంది. నాగేశ్వరరెడ్డి మార్క్ కామెడీతోపాటు యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆటాడుకుందాం..రా' సుశాంత్‌కి మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
సుశాంత్, సోనమ్ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాస్, సుధ, ఝాన్సీ, ఆనంద్, రమాప్రభ, రజిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com