అఖిల్ ప్రేమలో పడ్డాడు..

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

అఖిల్ ప్రేమ‌లో ప‌డ్డాడు...ఈ విష‌యాన్ని అఖిల్ స్వ‌యంగా ఓ ప్ర‌ముఖ‌ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు చెప్ప‌డం విశేషం. అఖిల్... ఇంత‌కీ మీ మ‌న‌సు దోచుకున్న‌ది ఎవ‌రు అని అడిగితే....ఆ ఒక్క‌టీ అడ‌గ‌ద్దు అంటున్నాడు. ఆమె పేరు చెప్ప‌ద్దు కనీసం ఆమె గురించి కాస్త‌ క్లూ ఇమ్మంటే... ఆమె మా ఫ్యామిలీ ఫ్రెండే. మా ఫ్యామిలీకి, ఆ అమ్మాయి ఫ్యామిలీకి చాలా కాలం నుంచి స్నేహం ఉంది. ఆమె ప‌బ్లిసిటీకి దూరంగా ఉంటుంది అందుక‌నే పూర్తి వివ‌రాలు చెప్ప‌డం లేదు అన్నాడు. అయితే... ఆమె న్యూయార్క్ లో చ‌దివింద‌ని. ఆమె అప్ క‌మింగ్ డిజైన్ అని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ ప్రేమ విష‌యం పేరెంట్స్ కి తెలియ‌ద‌ట‌. ఇటీవ‌ల అఖిల్ త‌న ప్రేమ విష‌యాన్ని పేరెంట్స్ నాగ్, అమ‌ల‌కి చెప్పాడ‌ట‌. ఆ అమ్మాయి బాగా తెలుసు కాబ‌ట్టి అఖిల్ ల‌వ్ కి నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.