నితిన్‌తో అఖిల్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనేది ట్యాగ్ లైన్‌.

ప్ర‌స్తుతం క‌థ స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.నాగ‌వంశీ నిర్మించ‌నున్నారు. నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే లెటెస్ట్ స‌మాచారం ప్రకారం ర‌ష్మిక‌తో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌నుంది.

ఆమె ఎవ‌రో కాదు.. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. హ‌లో నిరాశ ప‌రిచినా..రీసెంట్‌గా విడుద‌లైన చిత్ర‌ల‌హ‌రి క‌ల్యాణికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. త్వ‌ర‌లోనే ఈ అమ్మ‌డు నితిన్‌తో క‌లిసి న‌టించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళుతుంది.