పవన్ సరసన అఖిల్ భామ...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఎ.ఎం.రత్నం నిర్మాతగా ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. అన్నా చెల్లెల అనుబంధం అనే కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో చెల్లెలు క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. చెల్లెలు పాత్ర కోసం ఆనందిని నటింప చేయాలనుకుంటున్నారు. కాగా తమిళంలో శృతిహాసన్ చేసిన పాత్ర కోసం అఖిల్ అక్కినేని సరసన నటించిన సయేషా సైగల్‌ను నటింప చేయాలనుకుంటున్నారట. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారక సమాచారం వచ్చే అవకాశం ఉందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com