హ‌లో' ట్రైల‌ర్ రివ్యూ...

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

అక్కినేని అఖిల్ హీరోగా అన్న‌పూర్ణ స్టూడియోస్‌, మ‌నం ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిత‌మవుతున్న చిత్రం 'హ‌లో'. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌బోతున్నారు. అందులో భాగంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌ను అల్రెడి స్టార్ట్ చేసేశారు. శుక్ర‌వారం సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఈ ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మయ్యే విష‌య‌మేమంటే సినిమా అంతా హీరో త‌న ప్రేయ‌సిని క‌లుసుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నం. అనాథ అయిన అవినాష్‌ను జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ పెంచి పెద్ద‌చేస్తారు. చిన్న‌ప్పుడే విడిపోయిన హీరో హీరోయిన్లు ఎలా విడిపోతారు. ఎలా క‌లుసుకున్నార‌నేదే క‌థ‌. ఈ క్ర‌మంలో హీరో ఫోన్‌ను విల‌న్స్ కొట్టేస్తారు.

ఆ ఫోన్ కోసం హీరో విల‌న్స్‌తో గొడ‌వ‌ప‌డ‌తాడు. ఎప్ప‌టిలానే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ అజ‌య్ కోసం చాలా మంచి పాత్ర‌ను డిజైన్ చేశాడు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు చాలా బావున్నాయి. ట్రైల‌ర్‌లో వ‌చ్చే అనూప్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. మొత్తానికి ట్రైల‌ర్ ఆకట్టుకునేలా ఉంది.