'హ‌లో' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Friday,December 08 2017]

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం 'హలో'. కల్యాణి ప్రియదర్శ‌న్ హీరోయిన్. రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంటుగా విడుదలైన ట్రైల‌ర్‌కి మంచి స్పందన వచ్చింది.

అలాగే రెండు రోజుల క్రితం విడుదలైన పాట కూడా ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. అలాగే.. " 'హలో' సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక విడుదలకు ముస్తాబ‌వుతోంది. నా లైఫ్‌లో ఇదొక మంచి అనుభవం.

ఈ సినిమాలో పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. ప్రేమాభివందనములు" అని ట్వీట్ చేసారు. చిన్నప్పుడు విడిపోయిన తన సోల్ మేట్ ని ఒక అబ్బాయి ఎలా కలుసుకున్నాడు అన్నదే చిత్ర కథ. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 10న వైజాగ్ లో జరుగనుంది. అలాగే ఈ మూవీని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో రవితేజ ?

వరుస పరాజయాలతో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ 'రాజా ది గ్రేట్'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో రవితేజ తన స్పీడ్ పెంచారు.

అమరావతిలో 'జై సింహా' పాటల వేడుక ?

నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ‘జై సింహా’. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మళ్లీ బ్రేక్ ఇస్తున్న ప్రభాస్ ?

తొలి చిత్రం ఈశ్వర్ నుంచి మిర్చి వరకు.. ప్రతి సంవత్సరం కూడా తన చిత్రాలతో సందడి చేస్తూ వచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో.. కథానాయికల పాత్రలు కేవలం వినోదం కోసం అన్నట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వేలో మినహాయిస్తే.. ప్రతి సినిమాలోనూ ఇదే శైలి కనిపిస్తుంది. ఆయన రాసే ఆ మాటలతో కథానాయికలకు మంచి పేరే వచ్చింది కూడా.

ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ల్టీస్టార‌ర్ మూవీ

'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తాజాగా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్. దాదాపు 10 సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న డా.